చిరు 150 సినిమాలో కాజల్ ఖరారు

తిరిగి తిరిగి బండి మళ్ళీ చందమామ దగ్గరే ఆగింది. అవును చిరంజీవి 150 సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయినా గాని హీరోయిన్ కోసం వెతికి వెతికి, చివరికి బండి కాజల్ దగ్గరే ఆగింది. ఈ చందమామ సినిమా హీరోయిన్ నే అఫీషియల్ గా చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకు ముందు రెమ్యునరేషన్ విషయంలో తేడాలొచ్చినా గాని, వేరే ఏ హీరోయిన్ డేట్లు లేకపోవడంతో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తూ కాజల్ ని ఫీల్డ్ లోకి దింపేశారని సమాచారం. 

కొడుకు రామ్ చరణ్ తో ఇప్పటికే మగధీర, ఎవడు, గోవిందుడు అందరివాడేలే వంటి మూడు సినిమాల్లో నటించి చరణ్ కి తగ్గ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్, ఇప్పుడు తండ్రి చిరంజీవి పక్కన నటిస్తుండడంతో, మెగా అభిమానుల్లో ఈ జంట గురించి చర్చ చెట్టు పుట్టలని చూడకుండా దూసుకెళ్తూనే ఉంది.