
చిరంజీవి 150వ సినిమా కోసం ఆర్టిస్టుల వేట కొనసాగుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ్ లో భారీ హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో చిరు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే విలన్ రోల్ కోసం మొదట్లో జగపతి బాబు, వివేక్ ఒబేరాయ్ లాంటి పేర్లు వినబడినా కూడా, అధికారికంగా ఎవరినీ నిర్ణయించలేదు.
తాజాగా చిరు సినిమా యూనిట్ ఓ హీరోయిన్ ఇంటికి వెళితే అక్కడ విలన్ దొరికాడట. అవును చూడాలనివుంది సినిమాలో చిరంజీవితో పాటు నటించిన అంజలా ఝవేరి ఇంటికి ఏదో పని మీద వెళ్లిన వాళ్లకు చిరుకు విలన్ దొరికాడట. అంజలి జవేరి భర్త తరుణ్ అరోరాను చిరు 150వ సినిమా కోసం విలన్ లా అనుకున్నారట. సినిమా ఆర్టిస్ట్ అయిన తరుణ్ అరోరా కూడా దీనికి అప్పుడే ఓకే చేశారని తెలిసింది. మొత్తానికి చిరు హీరోయిన్ భర్త చిరుకు విలన్ గా మారాడన్నమాట.