మిర్చి అవార్డుల్లో ఎన్టీఆర్ హవా

టాలీవుడ్ లో ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తాజాగా మిర్చి అవార్డుల్లో మరో అరుదైన సత్కారం లభించింది. మంచి డ్యాన్సర్,యాక్టర్ గానే కాకుండా మంచి సింగర్ గా కూడా ఎన్టీఆర్ కు గుర్తింపు ఉంది. తెలుగులోనే కాదు కన్నడలో కూడా ఎన్టీఆర్ పాట పాడి అందరిని అలరించాడు. సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొడుకు కోసం చక్రవ్యూహ్ అనే కన్నడ సినిమాలో బుడ్డోడు లయా గెలయా అనే పాటను పాడాడు. 

దానితో పాటు ఈ సంవత్సరం ఆయన నాన్నకు ప్రేమతో సినిమాలో పాడిన ఫాలో ఫాలో పాట పెద్ద హిట్ అయింది. ఈ రెండు పాటలకు మిర్చి అవార్డులు రావడం విశేషం. హైదరాబాద్ లో జరుగుతున్న మిర్చి అవార్డుల ఫంక్షన్ లో ఎన్టీఆర్ కు ఈ రెండు పాటలకు అవార్డులను ప్రకటించారు. ఎంతో మంది స్టార్ హీరోలు పాటలు పాడిన కూడా, ఒక ప్రొఫెషనల్ సింగర్ ల పాడి అవార్డులను కూడా దక్కించుకున్న ఘనత ఎన్టీఆర్ కే దక్కడం విశేషం. ఈ మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీ ని చూసి ఇప్పుడు నందమూరి అభిమానులు కాలర్లు ఎగరేసుకుని మరీ తిరుగుతున్నారు.