బన్నీకి పృద్వి చెప్పను బ్రదర్ కౌంటర్

తెలుగు సినిమాల్లో అంతకు ముందు హిట్ అయిన సినిమాల్లోని పాపులర్ సీన్ లను, క్యారెక్టర్లపై స్పూప్ లు చేయడం కామన్. తాజాగా అలాంటి స్పూప్ మొత్తం సినిమాకు బాగా అడ్వాన్టేజ్ గా నిలుస్తోంది. తాజాగా వచ్చిన అల్లరి నరేష్ సెల్ఫీ రాజా సినిమా ట్రైలర్ గురించి టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. అల్లరోడు మరో అల్లరి చేసేశాడు.. కానీ ఏకంగా బన్నీతో ఎందుకు పెట్టుకున్నాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి బన్నీతో పెట్టుకుంది నరేష్ కాదు.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ.

పవన్ కళ్యాణ్ ప్రస్తావన కోరుతూ, ఆయన అభిమానులు అల్లు అర్జున్ స్టేజ్ పై మాట్లాడుతుండగా పవర్ స్టార్ అని అరిస్తే, దానికి  బన్నీ ‘చెప్పను బ్రదర్’ అంటూ సమాధానం చెప్పాడు. ఆ విషయం పెద్ద రచ్చే అయిపోయింది. దానితో చివరకు బన్నీ మరో సినిమా ఫంక్షన్ లో తాను ఎందుకు అలా అన్నాడో.. కొందరి ఫ్యాన్స్ అరుపులు మెగా ఫ్యామిలీని ఎలా బాధిస్తున్నాయో చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం విషయం అటుంచితే.. ఇప్పుడు ‘సెల్ఫీ రాజా’ సినిమాలో ఒక విలన్ ‘ఎవడ్రా నువ్వు’ అంటే.. వెంటనే‘చెప్పను బ్రదర్’ అంటున్నాడు 30 ఇయర్స్ పృథ్వి. ఇప్పుడు సెల్ఫీ రాజా ట్రైలర్ లో ఉన్న ఈ ముక్క చాలా వైరల్ అయిపోతోంది.