
రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేసి 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. చరణ్ తో పాటుగా ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, కోలీవుడ్ హీరో ప్రశాంత్ లు కూడా నటిస్తున్నారు. వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా సంక్రాంతి కానుకగా ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా వస్తుంది. ఆ సినిమా నుండి రోజుకో పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే దానితో పాటే రిలీజ్ కావాల్సిన చరణ్ సినిమా నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ రావట్లేదు. స్టేట్ రౌడీ అన్న టైటిల్ వినిపిస్తున్నా ఇంతవరకు అది చిత్రయూనిట్ అఫిషియల్ కన్ఫర్మేషన్ చేయలేదు. రాం చరణ్ 12వ సినిమాగా వస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.