
మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో భారీ స్థాయిలో అదే రేంజ్ అంచనాలతో వస్తున్న సినిమా సర్కార్. తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 6న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి మురుగదాస్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. తన పర్మిషన్ లేకుండా ఎవరు సర్కార్ సినిమా గురించి ఇంటర్వ్యూస్ లో పాల్గొనడానికి వీల్లేదని.. అలా తనని కాదని ఇంటర్వ్యూస్ ఇస్తే వారిపై చట్టపరమైన యాక్షన్స్ తీసుకుంటానని ట్వీట్ చేశాడు మురుగదాస్.
కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సర్కార్ సినిమా జూనియర్ ఆర్టిస్టులు సినిమా గురించి ఎక్కడ లీకులు చేయకుండా జాగ్రత్త పడేందుకే మురుగదాస్ ఇలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ గా మెసేజ్ పెట్టి ఉంటాడని అంటున్నారు. లాస్ట్ ఇయర్ మహేష్ తో స్పైడర్ సినిమా తీసి నిరాశ పరచిన మురుగదాస్ విజయ్ సర్కార్ తో సంచలనాలు సృష్టించాలని చూస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిది మారన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.