కథానాయకుడు మొదటి పార్ట్.. మహానాయకుడు రెండో పార్ట్..!

నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ఊహించని విధంగా రెండు పార్టులుగా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మొదటి పార్ట్ లో కథానాయకుడిగా రెండో పార్టులో మహానాయకుడిగా కనిపించబోతున్నాడు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా తీయాలన్న ఆలోచన గొప్ప విషయం అని చెప్పొచ్చు. 2019 జనవరి 9న మొదటి పార్ట్ రిలీజ్ అవుతుండగా సెకండ్ పార్ట్ జనవరి 24న రిలీజ్ కాబోతుంది.

మొదటి పార్టులో సినిమా ప్రస్థానం గురించి చూపిస్తారని తెలుస్తుండగా.. రెండో పార్టులో మాత్రం పూర్తిగా రాజకీయానికి సంబందించి విషయాలను ప్రస్థావిస్తారని తెలుస్తుంది. ఈరోజే రెండు పార్టులకు సంబందించిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రెండు పార్టులు కూడా 13 రోజుల గ్యాప్ తో రిలీజ్ చేయడం కచ్చితంగా రికార్డ్ అని చెప్పొచ్చు. మరి ఎన్.టి.ఆర్ మొదటి రెండు పార్టులు ఎలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.