బన్ని కోసం ఆ ఇద్దరు..!

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసే సినిమా ఏంటన్న విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. విక్రం కే కుమార్ తో సినిమా దాదాపు కన్ఫాం అనుకోగా చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అరవింద సమేత తర్వాత త్రివిక్రం ఖాళీ కాబట్టి బన్ని అతని కోసమే వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు. కాని ఈలోగా బన్ని కోసం ఇద్దరు దర్శకులు కథలు రాస్తున్నారని తెలుస్తుంది. 

ఆ ఇద్దరిలో ఒకరు మారుతి కాగా.. మరొకరు పరశురాం అని సమాచారం. ఈరోజుల్లో సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు వరకు మారుతి సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్టే ఫలితం అందుకున్నాయి. బన్నికి స్నేహితుడైనా సరే ఇన్నాళ్లు అతని కోసం కథ రాయలేదు. బన్నితో సినిమాకు ఇదే కరెక్ట్ టైం అని మారుతి పెన్ను పేపర్ పట్టేశాడట.

ఇక బన్నితో సినిమా కోసం పరశురాం కూడా లైన్ లో ఉన్నాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు పరశురాం. అతను కూడా బన్ని కోసం ఓ లైన్ రాసుకున్నాడట. మరి ఈ ఇద్దరిలో ఒకరితో అయినా బన్ని సినిమా చేస్తాడా లేక మళ్లీ నిర్ణయం మార్చుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.