నోటా ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ కెరియర్ లో హయ్యెస్ట్..!

విజయ్ దేవరకొండ, ఆనంద్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నోటా. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూడు సినిమాలతో స్టార్ రేంజ్ అందుకున్న విజయ్ దేవరకొండ నోటా ప్రీ రిలీజ్ బిజినెస్ తో అదరగొడుతున్నాడు.

గీతా గోవిందం సినిమానే 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విజయ్ నోటా సినిమా కేవలం తెలుగు వర్షనే 25 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. ఆంధ్రా, తెలంగాణా కలిపి 19 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.5 కోట్లు కాగా.. ఓవర్సీస్ లో 3.5 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. మొత్తంగా నోటా పాతిక కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విజయ్ కెరియర్ లో ఇదే హయ్యెస్ట్ బిజినెస్ అని తెలుస్తుంది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.