ఈషా రెబ్బ జాక్ పాట్ కొట్టేసింది..!

తెలుగు అమ్మాయి అయినా తెలుగులో హీరోయిన్ గా తన సత్తా చాటుతున్న ఈషా రెబ్బ కెరియర్ లో మొదటిసారి ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటిస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దెతో పాటుగా ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈషా రెబ్బ కన్నడలో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుందట. 

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ నటిస్తున్న ఎస్.ఆర్.కే సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. లక్కీ గోపాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈషా కన్నడ డెబ్యూ మూవీగా చేస్తుంది. ఎలాగు స్టార్ సరసన నటిస్తుంది కాబట్టి అమ్మడికి అక్కడ హిట్టు పక్కా అంటున్నారు. మరి జాక్ పాట్ కొట్టేసిన ఈషా రెబ్బ కెరియర్ ను ఇకమీదట ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.