
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ కూడా క్రేజీ స్టార్ గా అవతరించాడు. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అబ్బో కాంబినేషన్ అదిరిపోయిద్ది కదా ఈ మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ హీరో సూర్య, తెలుగు హీరో విజయ్ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తారట.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరు.. సినిమాను ఎవరు నిర్మిస్తారు అన్న విషయాన్ని వెళ్లడించలేదు కాని సూర్యతో మల్టీస్టారర్ సినిమా ఉంటుందని చూచాయగా చెప్పాడు విజయ్ దేవరకొండ. శుక్రవారం రిలీజ్ కాబోతున్న నోటా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈ మల్టీస్టారర్ విశేషాలను షేర్ చేసుకున్నాడు.
సూర్య, విజయ్ ఇద్దరు ఎవరి టాలెంట్ వారు చూపించి ఆడియెన్స్ లో మెప్పు పొందిన వారు. మరి అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇద్దరు కలిస్ చేసే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా బైలింగ్వల్ గా తీస్తారని తెలుస్తుంది.