ఇది హిట్ అయితే..!

కన్నడ నుండి తెలుగు పరిశ్రమకు పరిచయమైన రష్మిక తెలుగులో ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న రష్మిక తెలుగులో లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక ఈరోజు రిలీజ్ అవనున్న దేవదాస్ సినిమాలో కూడా రష్మిక ఒక హీరోయిన్ గా నటిస్తుంది. నాగార్జున, నాని కలిసి చేసిన మల్టీస్టరర్ మూవీగా వస్తున్న దేవదాస్ పై చాలా అంచనాలున్నాయి.

శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జునకి జోడిగా ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా.. నానికి జతగా రష్మిక మందన్న కనిపిస్తుంది. రష్మిక లక్ ఫేవర్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం రష్మికకు ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న రష్మిక చూస్తుంటే స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అనిపిస్తుంది.