
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ దేవదాస్. గురువారం రిలీజ్ అవనున్న ఈ సినిమా శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో తెరకెక్కింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న దేవదాస్ సినిమాకు సెన్సార్ వాళ్లు యు.ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
దేవాగా నాగార్జున, దాస్ గా నాని నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం అలరించింది. మల్టీస్టారర్ లో కొత్త జోష్ తో వస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూసి సినిమా హిట్ అనేలా ఉండగా సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటించారు.