
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ నుండి సెపరేట్ అయ్యి సొంతంగా ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు. అల్లు అర్జున్ కు ఏ కథ చెప్పాలన్న ఇదవరకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లాల్సిందే. అయితే నా పేరు సూర్య సినిమా ఫలితం చూశాక బన్ని తన ఆలోచన మార్చుకున్నాడు. అందుకే సొంతంగా కొత్త ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదవరకు బన్ని సినిమా అంటే అరవింద్, బన్ని వాసుల ప్రమేయం ఉండేది ఇప్పుడు అవేమి లేకుండా స్వతహాగా సొంత ప్రాజెక్టులు చేసుకుందామని భావిస్తున్నాడట అల్లు అర్జున్.
నా పేరు సూర్య తర్వాత విక్రం చెప్పిన కథ కూడా నచ్చలేదని తెలుస్తుంది. ఇక మరో పక్క నూతన దర్శకుడు చెప్పిన లైన్ నచ్చినా అతనితో రిస్క్ ఎందుకని ఆలోచిస్తున్నాడట. లింగు సామితో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయాల్సి ఉన్నా దానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. సొంత ఆఫీస్ లో కథా చర్చలు జరిపేలా ఏర్పాటు చేశాడట. అంతా ఓకే కాని అతని ఫ్యాన్స్ మాత్రం బన్ని తర్వాత సినిమా ఎనౌన్స్ మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు.