కబాలి ప్రీమియర్ షో టికెట్లు రెడీ

జులై 15న విడుదల కావాల్సిన కబాలి, రజినీ అభిమానులకు షాకిస్తూ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆగస్టు మొదటి వారంలో వస్తుందనుకున్న సినిమా, ఇప్పుడు జులై 22నే వచ్చేస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ప్రీమియర్ షో టికెట్లు రజినీ అభిమానుల కంటపడ్డాయి. మలేషియా లోని ఒక ఒక పాపులర్ థియేటర్ లో జులై 21 న ప్రీమియర్ షో, రాత్రి 9 గంటలకు ఉంటుంది. ఇందుకు సంబంధించిన టికెట్లు అప్పుడే ప్రింట్ కూడా అయిపోయాయి. ఒక్కో టిక్కెట్ ధర వంద మలేషియన్ రింగ్గెట్స్ గా తెలుస్తోంది.  

కబాలి సినిమా చాలా భాగం మలేషియా లోనే చిత్రీకరించడం వల్ల సెంటిమెంట్ గా ఇక్కడే ప్రీమియర్ షో విడుదలవుతుంది. ఇక ఈ లెక్కన 22న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాత కలైపులి ఎస్ థాను, ఇదే విషయాన్ని  ధృవీకరించాల్సి ఉంది. పీఏ రంజిత్ దర్శకత్వంలో వస్తున్న కబాలి సినిమాలో, రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది.