ఆ రీమేక్ వద్దనేసిన మాస్ రాజా..!

కొద్దిపాటి గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఆ తర్వాత చేసిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు ఫ్లాప్ అందించాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేస్తున్న రవితేజ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తెరి సినిమా రీమేక్ చేయాలని అనుకున్నాడు. అట్లీ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా తెలుగులో రీమేక్ చేశారు కూడా.

అయితే సరైన ప్రమోషన్ లేక ఆ సినిమా వచ్చింది వెళ్లింది ఎవరికి తెలియదు. అందుకే రవితేజ మేనరిజానికి తెరి పర్ఫెక్ట్ అని ఆ సినిమా రీమేక్ చేయాలని అనుకున్నారు. ఏమైందో ఏమో కాని ప్రస్తుతం ఆ ప్రయత్నం విరమించుకున్నాడట రవితేజ. స్ట్రైట్ సినిమలైతేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆల్రెడీ తెరి డబ్బింగ్ వర్షన్ పోలీస్ కొందరు చూశారని తెలుస్కుని రవితేజ ఈ సినిమా రీమేక్ వద్దంటున్నాడట.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో మాత్రం రవితేజ సినిమా చేస్తాడట. మంచి కథ ఉంటే తన డైరక్షన్ లో నటించేందుకు తాను సిద్ధమే అంటున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చే ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి.