ఫిదా రికార్డ్స్ కంటిన్యూ

శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సాయి పల్లవి సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఈ సినిమాలోని వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే.. అనే సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ సాంగ్ సినిమాలోనే కాదు యూట్యూబ్ లో కూడా సంచలనం సృష్టించింది. మధుప్రియ పాడిన ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. శక్తికాంత్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 15 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ పాటకు ఆల్రెడీ అవార్డులు రివార్డులు వస్తుండగా 150 మిలియన్ వ్యూస్ తో మరోసారి ఫిదా వార్తల్లో నిలిచింది.