
కింగ్ నాగార్జున, నాచురల్ స్టర్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండ రూపంలో షాక్ తగలబోతుంది. యువ హీరోల్లో మస్త్ జబర్దస్త్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ హీరోగా నోటా సినిమా రాబోతుంది. అక్టోబర్ 4న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా దేవదాస్ పై ఎటాక్ చేస్తుంది.
గీతా గోవిందం తర్వాత విజయ్ నటిస్తున్న నోటా మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. దేవదాస్ వచ్చిన వారానికే నోటా వస్తుండటంతో కచ్చితంగా దేవదాస్ కలక్షన్స్ మీద నోటా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు దేవదాస్ సినిమాకు ఏమంత బజ్ కూడా ఏర్పడటం లేదు. అందుకే విజయ్ దేవదాస్ సినిమాకు షాక్ ఇచ్చేలా ఉన్నాడని అంటున్నారు.