వార్ సీన్ కోసం అంత ఖర్చా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా కోసం ఓ భారీ యుద్ధ సన్నివేశం జరుగుతుందట. ఈ ఫైట్ కోసం 45 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ వార్ సీన్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ సీన్స్ కూడా స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది.   

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 150 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారట. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2019 సమ్మర్ లో సైరా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజైన సైరా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ అదరగొట్టిన చిరంజీవి సైరాతో మరోసారి సంచలనాలు సృష్టిస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.