
గురు తర్వాత విక్టరీ వెంకటేష్ కొద్దిపాటి గ్యాప్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్-2, బాబి డైరక్షన్ లో వెంకీ మామా సినిమాలు చేస్తున్న వెంకటేష్ ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమా కూడా లైన్ లో పెట్టుకున్నాడు. తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమానే అయినా సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తాడని తెలుస్తుంది.
ప్రస్తుతం వెంకీ అట్లూరి అఖిల్ 3వ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. తొలిప్రేమ లానే ఈ సినిమా కూడా లవ్ స్టోరీగా రాబోతుంది. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖిల్ సినిమా పూర్తి కాగానే వెంకటేష్ సినిమా ముహుర్తం పెట్టేస్తారట. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తారని తెలుస్తుంది. మరి ఈ వెంకీతో ఆ వెంకీ చేసే ఈ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.