
వైఎస్సార్ బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమాపై స్పెషల్ అప్డేట్ వైఎస్సార్ అభిమానులనే కాదు సిని ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ బయోపిక్ లో వై.ఎస్ పాత్రలో మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక సినిమాలో వై.ఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో ఇంకా అఫిషియల్ గా చెప్పలేదు. మొదట్లో తమిళ హీరోలు సూర్య, కార్తిలలో ఒకరు వైఎస్ జగన్ గా నటిస్తారని అన్నారు. కాని ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ యువనేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు.
వైఎస్ బయోపిక్ యాత్రలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని టాక్. అదే నిజమైతే యాత్ర సినిమాకు స్పెషల్ క్రేజ్ దక్కినట్టే. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ యాత్ర మూవీకి అదనపు ఆకర్షణ అవుతుంది. యాత్రలో విజయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అఫిషియల్ గా చెప్పేదాకా ఇది రూమర్ అన్నట్టే. ఒకవేళ నిజంగానే విజయ్ జగన్ పాత్రలో చేస్తే ఆన్ స్క్రీన్ జగన్మోహన్ రెడ్డిగా అర్జున్ రెడ్డి అదరగొట్టినట్టే.