
ఖైది నంబర్ 150 అంటూ రీ ఎంట్రీతో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ డైరక్షన్ లో మూవీ ఉంటుందని తెలుస్తుంది. డిసెంబర్ నుండే వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం కొరటాల శివ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట.
మిర్చి నుండి భరత్ అనే నేను వరకు స్టార్ సినిమాలను డైరెక్ట్ చేస్తూ వారి కెరియర్ బెస్ట్ హిట్ ఇస్తున్న కొరటాల శివ చిరంజీవికి అదే రేంజ్ కథ రెడీ చేశాడట. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా అండర్ కవర్ సోషల్ మెసేజ్ కూడా ఉండే కథతో చిరు సినిమా ఉంటుందట. ఈ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తాడని తెలుస్తుంది. మరి కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.