
ప్రతి ఏటా ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటుగా ఐఫా, సైమా అవార్డులు కూడా ఎంతో ప్రాధాన్యత తెచ్చుకున్నాయి. ఎంతో అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల్లో సైమా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ చాలా ప్రత్యేకమైనవి. దుబాయ్ లో ఈ అవార్డ్ వేడుకలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం లానే సైమా అవార్డ్స్ 2018 అవార్డులు ఇస్తున్నారు. సెప్టెంబర్ 14, 15 తేదీలల్లో ఈ అవార్డుల ప్రెసెంటేషన్ జరుగుతుంది.
కేవలం సౌత్ సినిమాలకే పరిమితమయ్యే ఈ అవార్డులు ఆడియెన్స్ ఓటింగ్ తో ఇవ్వడం జరుగుతుంది. ఇక సైమా 2018 అవార్డ్ విన్నర్స్ లిస్ట్ బయటకు వచ్చేసింది. అవార్డుల్లో బాహుబలి-2 అత్యధిక అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ హీరో, మూవీ కేటగిరీలో బాహుబలి అవార్డులు అందుకుంది.
సైమా 2018 అవార్డులు గెలుచుకున్న వారి లిస్ట్..
ఉత్తమ హీరో : ప్రభాస్ (బాహుబలి-2)
ఉత్తమ హీరోయిన్ : కాజల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ చిత్రం : బాహుబలి-2
ఉత్తమ సహాయ నటుడు : ఆది (నిన్నుకోరి)
ఉత్తమ సహాయ నటి : భూమిక (ఎం.సీ.ఏ)
ఉత్తమ విలన్ : రానా (బాహుబలి 2)
ఉత్తమ గాయని : మధుప్రియ (ఫిదా)
ఉత్తమ గాయకుడు : కాలభైరవ (బాహుబలి-2)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (బాహుబలి-2)
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి-2)