ఎనర్జిటిక్ స్టార్ భారీ మల్టీస్టారర్..!

ఎనర్జ్టిక్ స్టార్ రామ్ ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో హలో గురు ప్రేమకోసమే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ ఓ భారీ మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం యువ హీరోలంతా డిఫరెంట్ ప్రయోగాలతో తమ సత్తా చాటుతున్నారు. వారితో పోల్చుకుంటే రామ్ కాస్త వెనుక పడ్డాడని చెప్పొచ్చు.    

అందుకే క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడట. స్రవంతి రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమాలో రామ్ తో పాటుగా తమిళ హీరో నటిస్తాడని తెలుస్తుంది. రామ్ తీసుకున్న ఈ నిర్ణయం షాకింగ్ గా ఉంది. స్టార్ డైరక్టర్ ఈ సినిమాకు పనిచేస్తారని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలేంటో తెలియాల్సి ఉంది.