ఎన్టీఆర్ ఆడియో లేనట్టే..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయాలని చూశారు. ఆడియో వేడుకకి నందమూరి బాలకృష్ణ వస్తాడని అన్నారు. కాని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం అరవింద సమేత ఆడియో వేడుక క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ గా సెప్టెంబర్ 20న ఆన్ లైన్ లో ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేస్తారట.

అక్టోబర్ 11న రిలీజ్ కాబట్టి 1 నుండి 10 మధ్యలో రిలీజ్ కు ముందే భారీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందట. హరికృష్ణ మరణంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటైంది. కొన్నాళ్లుగా ఎన్.టి.ఆర్, బాలకృష్ణ, చంద్రబాబుల మధ్య మాటలు లేకున్నా ప్రస్తుతం అందరు కలిశారు. మరి ఒకే వేదిక మీద ఎన్.టి.ఆర్, బాలకృష్ణ, చంద్రబాబులను చూసి నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి.