
అక్కినేని నాగ చైతన్య సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. చైతు కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం ఆ సినిమా పాతిక కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. అయితే చైతు శైలజా రెడ్డి అల్లుడు బిజినెస్సే 25 కోట్లు అవడం విశేషం.
నైజాంలో 6.50 కోట్లు, సీడెడ్ లో 3.25 కోట్లు, ఓవర్సీస్ లో 3.50 కోట్ల బిజినెస్ తో పాటుగా మిగతా ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ చేసింది ఈ సినిమా. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. అంతేకాదు రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. కాబట్టి ఈ సినిమా పాతిక కోట్లు బిజినెస్ చేసేందుకు పెద్ద కష్టం కాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా నాగవంశీ నిర్మిస్తుండగా హారిక అండ్ హాసిని రాధాకృష్ణ రిలీజ్ బాధ్యతలను మీద వేసుకున్నారు.