
బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాని కన్నా అందులో కంటెస్టంట్ గా ఉన్న కౌశల్ కే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారని చెప్పొచ్చు. అఫ్కోర్స్ నాచురల్ స్టార్ నాని హీరోగా ఎప్పుడో స్టార్ అయ్యాడనుకోండి షో పరంగా చూస్తే నానిని దాటేసి ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు కౌశల్. బయట కౌశల్ ఆర్మీ ఒకటి ఏర్పడి అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది. ఇక ఫైనల్స్ దగ్గర పడుతున్న ఈ తరుణంలో కౌశల్ ఆర్మీ హైదరాబాద్ లో 2కె వాక్ ఏర్పాటు చేశారు.
ఈ 2కే వాక్ లో అనూహ్యంగా చాలా మంది కౌశల్ ఫాలోవర్స్ పాల్గొనడం జరిగింది. వాక్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కౌశల్ ఆర్మీ అంటూ టీ షర్ట్ ధరించడం జరిగింది. రోజు రోజుకి కౌశల్ మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఓ పక్క టైటిల్ రేసులో కౌశల్ ఉన్నా హౌజ్ మెట్స్ అంతా తనకు యాంటీ అవడం కాస్త వెనుకపడినట్టే అంటున్నారు. అయితే ఫైనల్ విన్నర్ డిసైడ్ చేసేది ఆడియెన్సే.. వారిలో కౌశల్ ఆర్మీ శాతమే ఎక్కువ. అందుకే కౌశల్ కే టైటిల్ విన్నర్ ఇచ్చేస్తారని అంటున్నారు. ఈ 2కే వాక్ తో కౌశల్ ఆర్మీ వారి సత్తా చాటారని చెప్పొచ్చు.