
అ! సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం క్వీన్ రీమేక్ గా వస్తున్న దటీజ్ మహాలక్ష్మి సినిమా చేస్తున్నాడు. ఇక దీనితో పాటుగా యాంగ్రీ యంగ్ మన్ డా. రాజశేఖర్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కల్కి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇవే కాదు ప్రశాంత్ వర్మతో మహేష్ సోదరి మంజుల ఓ క్రేజీ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తుందట.
లేటెస్ట్ గా ట్రెండ్ సృష్టిస్తున్న వెబ్ సీరీస్ ల మీద బడా నిర్మాతల కన్ను పడ్డది. అందుకే మంజుల ప్రశాంత్ వర్మతో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన అఫిషియల్ న్యూస్ బయటకు వస్తుంది. ఇంతకుముందు ఫీచర్ ఫిలంస్ నిర్మించిన మంజుల సడెన్ గా వెబ్ సీఎరీస్ ల మీద ఫోకస్ ఎందుకు పెట్టిందో తెలియాల్సి ఉంది. ఈమధ్యనే ఆమె డైరక్షన్ లో సందీప్ కిషన్, అమైరా దస్తర్ లీడ్ రోల్స్ గా మనసుకి నచ్చింది సినిమా చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.