బన్ని బాలీవుడ్ వెళ్తున్నాడా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే ఆ సినిమా గురించి అఫిషియల్ న్యూస్ అయితే బయటకు రాలేదు. లేటెస్ట్ గా బన్ని ఓ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడని వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో రాబోతున్న కపిల్ దేవ్ బయోపిక్ లో శ్రీకాంత్ కృష్ణమాచార్య పాత్రలో బన్ని కనిపిస్తాడని తెలుస్తుంది.

రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటిస్తున్నారు. కబీర్ ఖాన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బన్ని గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇండియాకు మొదటిసారి ప్రపంచ కప్ అందించిన రధసారధిగా కపిల్ దేవ్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ గెలిచిన టీం సభ్యులందరిని సెలబ్రిటీస్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు కబీర్ ఖాన్. నిజంగానే బన్ని ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బాగానే ఉంటుంది.