మళయాల స్టార్ తో వెంకటేష్..!

మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన విక్టరీ వెంకటేష్ ఇప్పటికే సెట్స్ మీద రెండు క్రేజీ మల్టీస్టారర్స్ ఉండగా మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ తో ఎఫ్-2, నాగ చైతన్యతో వెంకీ మామా సినిమాలు చేస్తున్న వెంకటేష్ మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో మల్టీస్టారర్ ఫిక్స్ చేసుకున్నాడట. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. 

నూతన దర్శకుడు చెప్పిన లైన్ నచ్చి వెంకటేష్, దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తుంది. గురు తర్వాత వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల మీద పడ్డాడని చెప్పొచ్చు. ఇక మహానటి సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. మరి వెంకటేష్, దుల్కర్ సల్మాన్ ల క్రేజీ మల్టీస్టారర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి.