'మా' వివాదంపై చిరంజీవి ఫైర్..!

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో నిధుల దుర్వినియోగం పట్ల కార్యదర్శి నరేష్, అధ్యక్షుడు శివాజి రాజా, ట్రెజరర్ శ్రీకాంత్ లను టార్గెట్ చేశాడు ఉదయం ఒకరు సాయంత్రం మరొకరి ప్రెస్ మీట్లు పెట్టేసరికి వ్యవహారం బాగా వేడేక్కేసింది. మా సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా యూఎస్ లో చిరుతో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ చిరు వస్తే 2 కోట్లు ఇస్తామని చెప్పిన నిర్వాహకులు 1 కోటే ఇచ్చారట. 

ఆ కోటి కూడా దుర్వినియోగమయ్యాయని నరేష్ చెబుతున్న మాట. ఇక మరోపక్క మా మరో ఈవెంట్ కు మహేష్ వెళ్లాల్సి ఉంది. ఈ గొడవ సర్ధుమనిగే దాకా మహేష్ మా ఈవెంట్ కు వెళ్లేందుకు సుముఖంగా లేడని తెలుస్తుంది. అయితే చిలికి చిలికి గాలి వానైన మా వివాదంపై మెగాస్టార్ చిరంజీవి చాలా ఫైర్ అయ్యాడట. నరేష్, శివాజి రాజాలు ఇద్దరిని మందలించాడట. విషయం ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడాలి కాని ప్రెస్ మీట్ పెడితే ఇండస్ట్రీ పరువు గంగలో కలుస్తుందని అన్నారట. ఈరోజు రేపట్లో ఈ రెండు వర్గాలు కలిసి సంధి కుదిర్చే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.