రష్మిక అప్పట్లో కూడా అదరగొట్టింది..!

ఛలో, గీతా గోవిందం రెండు వరుస హిట్లతో సత్తా చాటిన రష్మిక మందన్న సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో చేతినిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక కాలేజ్ డేస్ నుండి అదరగొట్టేదని తెలుస్తుంది. అమ్మడు బెంగళూరు రామయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.

ఆ టైంలో అమ్మడు చేసిన ఓ డ్యాన్స్ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ధూం సాంగ్ వేస్తూ అమ్మడు డ్యాన్స్ చించేసింది. కాలేజ్ డేస్ లో కూడా రష్మిక అదరగొట్టడం చూసి ఆమె ఫ్యాన్స్ ఆమె మీద మరింత అభిమానం పెంచుకుంటున్నారు. స్లీప్ లెస్ కుర్తీతో రష్మిక చేసిన ఆ డ్యాన్స్ క్లిప్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.