
యువ హీరోల్లో మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. కేవలం మూడు సినిమాలతోనే స్టార్ రేంజ్ అందుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా వచ్చిన గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల గ్రాస్ అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో నోటా సినిమాతో రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో పాటుగా టాక్సీ వాలా రిలీజ్ రెడీ అవుతుండగా మరో పక్క సెట్స్ మీద డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఉంది.
డియర్ కామ్రేడ్ పూర్తి కాగానే విజయ్ తో సినిమా చేసేందుకు చాలామ మంది దర్శకులు వెంట పడుతున్నారు. వారిలో క్రెజీ డైరక్టర్ మారుతి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం చైతుతో తీసిన శైలజా రెడ్డి అల్లుడుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మారుతి ట్రైలర్ తో అలరించాడు. చూస్తుంటే ఈ సినిమా కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. ఈమధ్యనే విజయ్ కు మారుతి లైన్ చెప్పాడట. దాదాపు ఈ కాంబినేషన్ లో సినిమా కన్ఫాం అంటున్నారు.