
దర్శకుడిగా కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని తేజ రానాతో హిట్ కొట్టిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. తేజని హిట్ ట్రాక్ ఎక్కేలా చేసిన ఈ సినిమాతో మరోసారి ఆయన డైరక్షన్ టాలెంట్ తో మెప్పించాడు. రానా, కాజల్ జంటగా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కిరణ్, భరత్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్ కూడా భాగస్వామ్యం అయ్యింది.
లేటెస్ట్ గా ఆ సినిమా సీక్వల్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు స్పందించారు. తేజ, రానా ఓకే అంటే ఆ సినిమా సీక్వల్ తీసేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. సురేష్ బాబు కూడా నేనే రాజు నేనే మంత్రి సీక్వల్ పై మనసు పడ్డారట. ఎలాగు ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి బయటకు వచ్చాడు కాబట్టి తేజ ఈ సీక్వల్ చేస్తాడని అంటున్నారు.