
మారుతి డైరక్షన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా వచ్చే వారం రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 13న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబ్ర్ 9న గ్రాండ్ గా చేస్తున్నారట. ఈ వేడుకకు దేవదాస్ లు వచ్చేస్తున్నారట. లేటెస్ట్ గా రాబోతున్న దేవదాస్ మల్టీస్టారర్ హీరోస్ నాగార్జున, నానిలు శైలజా రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారట.
చైతు కోసం నాగార్జున రావడం కొత్తేమి కాదు కాని నాని రావడం మాత్రం కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. మారుతి డైరక్షన్ లో నాని భలే భలే మగాడివోయ్ హిట్ కొట్టాడు కాబట్టి ఆ కృతజ్ఞత కోసమైనా నాని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నాడని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో చైతు సరసన అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.