
కేరళలో వరదల కారణంగా కోట్ల కొద్ది నష్టం.. వందల కొద్ది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు సిని సెలబ్రిటీస్ కూడా కేరళ ఉదంతానికి తమ వంతు సపోర్ట్ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల పరిశ్రమల నుండి స్టార్ హీరోలంతా తమకు తోచిన మొత్తాన్ని కేరళ సిఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. అయితే వారిలో ప్రభాస్ మాత్రం కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు.
కేరళకు ప్రభాస్ విరాళం ఇచ్చాడని తెలుసు కాని ఎంత ఏంటి అన్నది బయటకు రాలేదు. అయితే కేరళకు ప్రభాస్ ఒక్కడే కోటి విరాళం ఇచ్చాడు. ఈ విషయాన్ని కేరళ మంత్రి కడకంపల్లి సుందరేశన్ వెళ్లడించారు. మళయాల స్టార్స్ అంతా 4 కోట్ల కార్లలో ప్రయాణిస్తారు కాని ఏ ఒక్కరు ఇలా స్పందించలేదు. కచ్చితంగా వారంతా ప్రభాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే అంటూ చురకలంటించాడు.