
భరత్ అనే నేను సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ భామ కియరా అద్వాని ఆ సినిమా హిట్ కొట్టిందో లేదో చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ ఛాన్స్ అందుకుంది. మహేష్, చరణ్ లాంటి స్టార్స్ తో నటించడంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది కియరా అద్వాని. ఇక ప్రస్తుతం చరణ్ తో షూటింగ్ లో పాల్గొంటున్న ఈ అమ్మడు చరణ్ చాలా చిలిపి అంటూ కామెంట్స్ చేస్తుంది.
సెట్ లో తను వచ్చినప్పటి నుండి వెళ్లే దాకా చాలా సరదాగా ఉంటాడని. అతనో స్టార్ హీరో అనేది ఎక్కడ కనిపించదని అంటుంది. అంతేకాదు చిలిపిగా మాట్లాడటం కూడా చరణ్ చేస్తుంటాడట. కియరా తో చరణ్ చేస్తున్న ఆ చిలిపి పనులేంటో కాని రాం చరణ్ లో ఇదవరకు ఎవరికి తెలియని ఓ కొత్త విషయాన్ని బయటకు చెప్పి అందరిని సర్ ప్రైజ్ చేసింది కియరా అద్వాని.