పటాస్ హిట్టు మిస్సైన రానా..!

కళ్యాణ్ రాం కెరియర్ లో సూపర్ హిట్ కొట్టిన సినిమా పటాస్. అనీల్ రావిపుడి డైరక్షన్ లో అతని మొదటి సినిమాగా వచ్చిన ఈ పటాస్ అసలు కళ్యాణ్ రాం చేయాల్సింది కాదట. దగ్గుబాటి హీరో రానా పటాస్ లో హీరోగా నటించాల్సిందట. అనీల్ రావిపుడి మొదట ఈ కథను రానాకే వినిపించాడట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా హీరోగా ఈ సినిమా మొదలు పెట్టడమే ఆలస్యం అనుకుంటుండగా బాహుబలి కోసం రానా డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందట.

అయితే బాహుబలి చేస్తూ ఇది చేయొచ్చు కాని బాహుబలికి అనుకున్న టైం కన్నా ఎక్కువ కేటాయించడం వల్ల పటాస్ ఛాన్స్ మిస్సయ్యాడు రానా. అలా రానా మిస్సైన పటాస్ కథ కళ్యాణ్ రాం కు చెప్పడం అతను చేయడం ఆ సినిమా హిట్ అవడం జరిగింది. అతనొక్కడే సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న సినిమాగా పటాస్ కళ్యాణ్ రాం కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచింది. మరి ఈ సినిమా రానా చేస్తే ఎలా ఉండేదో తెలియదు కాని కళ్యాణ్ రాం మాత్రం పటాస్ తో పవర్ ఫుల్ హిట్ కొట్టాడు.