
కమల్ కూతురిగా ముందు మ్యూజిషియన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఆ తర్వాత హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్న అమ్మడి కెరియర్ గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. అయితే ఏడాది పైగా కొత్త సినిమాలేమి ఒప్పుకోని శృతి పై రకరకాల రూమర్స్ వచ్చాయి. తన ప్రేమికుడు మైఖేల్ తో శృతి హాసన్ పెళ్లికి సిద్ధమైందని అందుకే ఆమె సినిమాలు వద్దంటుందని అన్నారు.
ఆ రూమర్స్ అన్నిటికి ఒకేసారి ఆన్సర్ ఇచ్చింది శృతి హాసన్. ఇన్నాళ్లు తన బలాలు, బలహీనతలు తెలుసుకునేందుకు.. తానేంటో తనకి అర్ధం అయ్యేందుకు సినిమాలకు దూరంగా ఉన్నానని చెబుతుంది శృతి హాసన్. ఇప్పుడు తానేంటో తనకి పూర్తిగా అర్ధమైందని ఇక నుండి వరుసగా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతన్ మహేష్ మంజ్రేఖర్ తెరకెక్కిస్తున్న బాలీవుడ్ సినిమాతో పాటుగా కమల్ శభాష్ నాయుడు సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తుంది. స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడు టైం గ్యాప్ ఇచ్చినా మళ్లీ సినిమాల్లో చేస్తానని చెప్పడం ఆమె ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్తని చెప్పొచ్చు.