బయోపిక్ లో ఎన్టీఆర్..?

హరికృష్ణ మరణంతో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక చోట చేరింది. అన్న తమ్ముళ్లకు అండగా బాబాయ్ బాలకృష్ణ తన ప్రేమను చాటుకున్నాడు. ఇన్నాళ్లు బాబాయ్, అబ్బాయ్ ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్టే అంటున్నారు. కారణం తెలియకున్నా బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం అందరికి తెలిసిందే. తాను వెళ్తూ నందమూరి కుటుంబాన్ని ఒక్కటి చేశాడు హరికృష్ణ.

ఇక ఈ టైంలో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో జూనియర్ కు ఛాన్స్ ఇస్తాడని వార్తలు మొదలయ్యాయి. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో యంగ్ ఎన్.టి.ఆర్ రోల్ ఇంకా ఖాళీగానే ఉంది. శర్వానంద్ ను అడిగినా కాదనడంతో ఇప్పుడు తారక్ ను ఆ రోల్ కోసం తీసుకుంటారా అంటూ చర్చలు మొదలు పెట్టారు. 

ఏది ఏమైనా నందమూరి ఫ్యాన్స్ కు హరికృష్ణ దూరమయ్యాడన్న బాధ ఉన్నా.. బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ కలవడం మాత్రం కాస్త ఉత్సాహంగా అనిపిస్తుంది. మరి ఇద్దరు కలిసి ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉంటారు అన్నది చూడాలి.