ఈనాటి ఈ సుప్రభాతగీతం.. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి స్పెషల్..!

మహానేత.. ప్రజల మనసులు గెలిచిన నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో వస్తున్న సినిమా యాత్ర. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా కొద్ది నిమిషాల క్రితం సమర శంఖం సాంగ్ రిలీజ్ చేశారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా సమర శంఖం సాంగ్ రిలీజ్ చేశారు.   

ఈనాటి ఈ సుప్రభాతగీతం.. అంటూ మొదలైన ఈ సాంగ్ లిరిక్ ఎక్కడో పైనలేదు యుద్ధమన్నది.. అంతరంగమే రణరంగమైనది అంటూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన అద్భుతమైన సాహిత్యంతో వచ్చింది. కృష్ణ కుమార్ (కె) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ ను కాల భైరవ పాడటం జరిగింది. వైఎస్ పాదయాత్ర నేపథ్యంతో వస్తున్న లో మళయాల స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ గా నటిస్తున్నారు. సినిమాను జనవరి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.