
అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వతున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సెప్టెంబర్ 13న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.
మారుతి మార్క్ కనిపించేలా ట్రైలర్ ఉంది. వినోదాత్మకంగా సాగిన ఈ ట్రైలర్ లో తల్లి కూతుళ్ల మధ్య అల్లుడు ఎలా ఇబ్బంది పడ్డాడనేది సినిమా కథ. ఇక సినిమాలో చైతు లుక్ కొత్తగా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. థర్టీ ఇయర్స్ పృధ్వి కామెడీ నవ్విస్తుందని ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. ఇక చివర్లో డాడీ స్కీం బాగా వర్క్ అవుట్ అయ్యిందని ప్రియరాగాలే సాంగ్ మ్యూజిక్ వదిలారు. చూస్తుంటే మారుతి నాగ చైతన్యకు స్టార్ రేంజ్ వచ్చే సినిమా తీశాడని ట్రైలర్ చూసి చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో మరో రెండు వారాలు వెయిట్ చేస్తే తెలుస్తుంది.