కొరటాల, చిరు.. ఆమెని ఫిక్స్ చేశారా..!

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస సక్సెస్ లను అందుకుంటున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే కథ రెడీ చేయగా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయబోతున్నారట. సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసే సినిమా ఇదే అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని సెలెక్ట్ చేశారట.


చిరు 152వ సినిమాగా వస్తున్న కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా తమన్నా ఫైనల్ అంటున్నారు. ఖైది నంబర్ 150లో కాజల్ తో జత కట్టిన చిరు ఈసారి మిల్కీ బ్యూటీని ఫైనల్ చేశారట. ఆల్రెడీ చరణ్ తో తమన్నాతో కలిసి నటించి ఇప్పుడు చిరు పక్కన నటిస్తుంది. డిసెంబర్ లో ముహుర్తం పెట్టుకోనున్న ఈ సినిమా సైరా రిలీజ్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందట.