
2005లో వచ్చిన పందెం కోడి సూపర్ హిట్ అయ్యింది. లింగుసామి డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా సీక్వల్ ఎన్నాళ్ల నుండో అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. పందెం కోడి-2గా వస్తున్న ఈ సినిమా అదే రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ లోనే సినిమా రేంజ్ చూపించారు దర్శకుడు లింగుసామి.
నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు.. అడ్డుకోవడమే మొదలు పెట్టా అంటూ చెబుతాడు విశాల్. ఇక టీజర్ ఎండింగ్ లో ఇది పులి మేక ఆట కాదు పులి మేక కలిసి ఆడే ఆట అంటూ సినిమాపై అంచనాలు పెంచారు. సినిమా విజువల్ గా థ్రిల్ అయ్యేలా ఉంది. తప్పకుండా మెళ్లీ ఈ సినిమా సీక్వల్ పై ఉన్న అంచనాలను రీచ్ అయ్యేలా ఉంటుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.