
నాచురల్ స్టార్ నాని వరుస విజయాల్లో ఒకటిగా వచ్చింది నిన్ను కోరి సినిమా. నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాని సక్సెస్ మేనియాను కొనసాగించేలా చేసింది. నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టి ముగ్గురు ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెర్కకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎలాగు సూపర్ హిట్ సినిమా కాబట్టి తమిళంలో కూడా సేం రిజల్ట్ అందుకునే అవకాశం ఉంది.
నాని పాత్రలో వైభవ్ నటిస్తున్నాడు. కాస్మో కిరణ్ నిర్మాతగా వ్యవహిస్తున్న తమిళ నిన్ను కోరి సినిమాలో సపోర్టింగ్ రోల్ గా ఆది తన పాత్ర తానే చేస్తాడా లేక వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. ఫెయిల్యూర్ లవ్ స్టోరీని కూడా హిట్ అందుకునేలా చేసిన నాని సినిమాతో మరోసారి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం నాని దేవదాస్ సినిమా చేస్తున్నాడు, జర్సీ సినిమా కూడా నాని లైన్ లో పెట్టాడు. మరి నిన్ను కోరి తమిళ రీమేక్ ఎలా ఉండబోతుందో సినిమా వస్తేనే కాని చెప్పలేం.