
నాని హోస్ట్ గా స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్-2. సెకండ్ సీజన్ మరో నాలుగు వారాలే ఉండగా హౌజ్ లో కంటెస్టంట్స్ ఫైట్ మరింత ముదిరిందని చెప్పొచ్చు. ముఖ్యంగా హౌజ్ లో స్టాంగ్ కంటెస్టంట్ అయిన కౌశల్ తో తనీష్, గీతాల గొడవ కౌశల్ కు బయట ఇంకా సపోర్ట్ పెరిగేలా చేస్తుంది. నాని ఎంత మొత్తుకున్నా సరే తనీష్, గీతాలు కౌశల్ మైండ్ గేం ను అర్ధం చేసుకోవట్లేదు.
ఇక మరోపక్క హౌజ్ లో కామన్ మెన్ లో ఒకరిగా అడుగుపెట్టిన గణేష్ కూడా కౌశల్ మీద అడపాదడపా తన పంచులు వేస్తుంటాడు. అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే హౌల్ లో ఎవరైతే కౌశల్ మీద గొడవ పడతారో వారిని బయటకు పంపించడమే పనిగా పెట్టుకునే కౌశల్ ఆర్మీ టీం ఉంది. అసలు లాస్ట్ వీక్ నామినేషన్స్ లోనే గణేష్ ఉంటే అతన్ని పంపించేయాలనుకున్న కౌశల్ ఆర్మీకి ఈ వారం గణేష్ నామినేషన్స్ లో ఉండే సరికి అతన్ని ఎలాగైనా బయటకు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం కౌశల్ అర్మీ చేతుల్లో ఉందని చెప్పలేం కాని దాదాపు కౌశల్ ఆర్మీ ప్రభావం ఎలిమినేషన్ మీద ఉంటుంది. మరి ఆ లెక్కన చూస్తే ఈ వారం గణేష్ సర్ధేయాల్సిందే అని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.