సాహసం చేస్తున్న పూజా హెగ్దె..!

తన సినిమా పర్ఫెక్షన్ కోసం ఎలాంటి రిస్కైనా తీసుకునే దర్శకుల్లో త్రివిక్రం ఒకరు ఒక్క అప్పుడెప్పుడే వచ్చిన మహేష్ ఖలేజా, ఈ ఇయర్ వచ్చిన అజ్ఞాతవాసి తప్ప మిగతా అన్ని సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందినవే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు త్రివిక్రం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాలో హీరోయిన్స్ కు ఓన్ డబ్బింగ్ చెప్పించడం త్రివిక్రం కు అలవాటే. అందులో భాగంగా ఇప్పుడు అరవింద సమేత కోసం కూడా పూజా హెగ్దెతో కూడా తెలుగు ఓన్ డబ్బింగ్ చెప్పిస్తున్నాడట. ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్దె అల్లు అర్జున్ తో నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ కొట్టి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆ సినిమా నుండి అమ్మడు స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పడం నేర్చుకుంటే ఇక పూజాకి తెలుగులో తిరుగు ఉండదని చెప్పొచ్చు.