తండ్రి విషయంలో ఆ కోరిక నెరవేరలేదు..!

రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ నందమూరి ఫ్యామిలీని శోక సముద్రంలో మునిగిపోయేలా చేసింది. పెళ్లికంటూ బయలుదేరిన తండ్రి అనంతలోకాలకు వెళ్లాడని తెలిసి నిర్ఘాంతపోయిన తనయులిద్దరు గుండెనిండా బాధతో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా అన్నదమ్ములైన ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ల మధ్య సన్నిహిత్యం బాగా పెరిగింది. దానికి హరికృష్ణ ముఖ్య కారణమని తెలిసిందే.

ఇక ఈమధ్య తనయుల సిని వేడుకలకు వచ్చి అలరిస్తున్న హరికృష్ణ తనయులిద్దరితో సినిమాలో నటించాలని అనుకున్నారు. కళ్యాణ్ రాం కూడా తండ్రితో, తమ్ముడితో కలిసి సినిమా చేయాలని తనకు తెలిసిన రైటర్స్ కు కథ సిద్ధం చేయమని కూడా చెప్పారట. కాని ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ రాం కోరిక తీర్చకుండానే వెళ్లిపోయారు హరికృష్ణ. నల్గొండ జిల్లాలోనే నందమూరి ఫ్యామిలీకి యాక్సిడెంట్స్ అవుతుండటం విశేషం. 2014లో హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రాం రోడ్ యాక్సిడెంట్ లో చనిపోగా ఈరోజు హరికృష్ణ అదే నల్గొండ హైవే మీదే ప్రాణాలు విడిచారు.