
ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వస్తే మళ్లీ రీ ఎంట్రీ చాలా కష్టం అలాంటిది ఈసారి సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ లో ఫేవరెట్ కంటెస్టంట్స్ ను మళ్లీ హౌజ్ లోకి పంపించమని ఓటింగ్ జరుపగా దానిలో అత్యధికంగా (కౌశల్ ఆర్మీ సపొర్ట్ తో) నూతన్ నాయుడు, యాంకర్ శ్యామలా ఇద్దరు బిగ్ బాస్ హౌజ్ లోకి మళ్లీ ఎంటర్ అయ్యారు. ఎవరికి లేని సెకండ్ ఎంట్రీ ఛాన్స్ ఈ ఇద్దరికే దక్కింది.
అయితే ఒకసారి దేని వల్ల ఎలిమినేట్ అయ్యామో తెలుసుకుని బయటకొచ్చి బాగా కనిపెట్టిన శ్యామలా ఈసారి జాగ్రత్త పడుతుంది. కాని నూతన్ నాయుడు మాత్రం బయట జరిపిన లైవ్ చాట్ లో ఉన్నంత జోష్ హౌజ్ లోకి వెళ్లాక కనిపించలేదు. కేవలం కౌశల్ ఒక్కడితోనే కాస్త క్లోజ్ గా ఉంటున్నట్టు మాట్లాడుతున్న నూతన్ నాయుడు ఈసారి ఎలిమినేషన్ కాకుండానే హౌజ్ నుండి నిష్క్రమించాడు. అదెలా అంటే నిన్న కెప్టెన్సీ టాస్కులో భాగంగా కౌశల్ ను నూతన్ నాయుడు కాపాడేలా రోల్ రైడ్ పై బాల్స్ విసిరాడు. ఈ క్రమంలో ఎవరో విసిరిన బంతి తనకు వచ్చి తగలడంతో కింద్ర పడిన నూతన్ నాయుడు శోల్డర్ కు బలమైన గాయం అయినట్టు గుర్తించాడు. బిగ్ బాస్ సలహా మేరకు కన్ ఫెషన్ రూం లో డాక్టర్ చూసి అది పెద్ద గాయమే అని డిక్లేర్ చేయగా ఆయనను హౌజ్ నుండి బయటకు పంపించారు.
గేమ్ లో కూడా కెప్టెన్సీ టాస్కులో కౌశల్ ఓడిపోయాడు. తనీష్, సామ్రాట్, అమిత్ లు కౌశల్ ను టార్గెట్ చేస్తూ బాల్స్ విసరగా.. గీతా మాధురి, శ్యామలా, దీప్తిలు కౌశల్ కు సపోర్ట్ గా రోల్ రైడ్ మీద బంతులు విసిరాడు. అయితే నిర్ణీత కాలంలో బిగ్ బాస్ బాసులతో పిరమిడ్ నిర్మాణం నిర్మించిన రోల్ రైడాని కొత్త కెప్టెన్ గా ప్రకటించారు.