అర్ధనారికి అప్పుడే ఐదింతల లాభం!

క్షణం, బిచ్చగాడు తర్వాత ఈ మధ్య మళ్లీ ఆ రేంజ్ సర్ ప్రైజ్ హిట్ గా నిలిచిన సినిమా అర్ధనారి. గతంలో మోహన్ బాబు, శర్వానంద్ కాంబినేషన్లో రాజు మహారాజు, యూత్ ఫుల్ ఎంటెర్టైనెర్ సరదాగా అమ్మాయితో సినిమాలను డైరెక్ట్ చేసిన భాను శంకర్, ఈ సారి అర్ధనారి తో ముందుకొచ్చాడు.

ఎలాంటి హైప్, పబ్లిసిటీ లేకుండా కేవలం రిలీజ్ కి కొన్ని రాజుల ముందు గోడల పై ఉన్న పోస్టర్ల తోనే సినిమాలోని వైవిధ్యం డైరెక్టర్ చెప్పగలిగాడు. బహుశా అందుకేనేమో, ఎలాంటి స్టార్లు లేని సినిమా అయినా గాని మొదటి రోజే, హౌస్ ఫుల్ కలెక్షన్లతో ముందుకెళ్లింది ఈ అర్ధనారి. 

ఆ నమ్మకంతోనే ఇప్పుడు కోలీవుడ్, మోలీవుడ్, శాండల్ వుడ్ నుండి నిర్మాతలు అర్ధనారి సినిమా రైట్స్ కోసం ఎగబడుతున్నారు. మూడు కోట్ల బడ్జెట్ తో రూపొందిచ్చిన అర్ధనారికి, రీమేక్ రైట్స్ ద్వారా పదిహేను కోట్లు ముట్టినట్లు సమాచారం. అర్జున్ యజత్, మౌర్యాని ముఖ్య పాత్రలు పోషించిన అర్ధనారి, ఈ వీకెండ్ లో కలెక్షన్లు మరిన్ని కొల్లగొట్టనుంది.